పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు ఉగ్రసేనుని రాజ్యభారమును వహింపఁ జెప్పుట

నిభక్తి నూరార్చి య్యుగ్రసేనుఁ
నుఁ గొని కౌఁగిటదియించి, శౌరి
“నీరాజ్యమంతయు నిర్దయవృత్తిఁ 
గ్రూరుఁడై తానెకైకొని యంతఁబోక
యాకలఁబెట్టి మి మ్మలఁచిన యతఁడు
కాకున్న పనియట్లగాక పోరాదు
హీనమానసులైన యీదురాత్ములకుఁ
గానఁ జింతింపకఁ గంసాదిసుతుల
గ్ని సంస్కారాదుర్థిఁ జేయింపు 
ప్రాజ్ఞుల విప్రులఁ నిచి వేవేగ
రాజ్యభారముఁ దాల్చి మణ మాకెల్ల
పూజ్యుఁ డవై లీల భూమిపాలింపు”, 
నుటయు హరిఁ జూచి య్యుగ్రసేనుఁ
“డనఘ! నన్నిమ్మాటలాడఁగఁ దగునె? 
హీనుఁడ నతివృద్ధ నీరాజ్యభరము
పూన నా కర్హంబె? పుండరీకీక్ష! 
సుదేవుఁ బట్టంబు లనొప్పఁ గట్టి
సమానగతిని రాజ్యము నీవెతీర్పు;   - 280
న్నులు చల్లఁగాఁ లకాలమెల్ల
నిన్నుఁ జూచుచుఁ బ్రీతి నెగెడద కృష్ణ!” 
నుచుఁ బల్కిన శౌరి యారాజుఁ జూచి
వినయంబు నీతియు వెలయ నిట్లనియె. 
“యాదవులకు రాజ్య ర్హకృత్యములు
గాదు యయాతి వాక్యముఁ ద్రోయరాదు; 
కావున సామ్రాజ్య మనీయలక్ష్మి
నీవె పాలించి మన్నించు, బాంధవుల
ప్పించి వారికి రాజ్యంబులిచ్చి
ప్పక మమ్మెల్ల యనేలుకొనుము. 
నిఖిల భూపతులును నింపుసేయంగ
సుఖలీలనుండు; కంసుని వంతమాను”, 
ని పల్కి యాతని వనీభరంబుఁ
గొనకొనుమని నీయకొలిపి మురారి